NTV Telugu Site icon

Peddapalli : ప్రేమ వ్యవహారం? ప్రియుడిని నరికి చంపిన ప్రియురాలి తండ్రి!

Peddapalli

Peddapalli

పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో దుండగులు సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు. సాయికుమార్ జన్మదినం రోజే హత్య కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్‌ ను హత్య చేసినట్లు తెలుస్తోంది.

READ MORE: MADSquare : మ్యాడ్ స్క్వేర్ ఓవర్శీస్ ప్రీమియర్ టాక్

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు‌ను ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం గాలిస్తున్నారు.

READ MORE: Minister Ramprasad Reddy: గత వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రజా సమస్యలు ఏర్పడ్డాయి..