AP Crime: నూజివీడులో యువకుడి దారుణ హత్య.. రోలుతో కొట్టి.. బిల్డింగ్ పై నుంచి తోసివేసి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం శాంతినగర్ కు చెందిన యశ్వంత్ రెడ్డి (16) సంవత్సరాల యువకుడిని దారుణంగా హత్య చేశారు.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి రామిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొవ్వూరి సందీప్ కాగా చిన్న కుమారుడు యశ్వంత్ రెడ్డి. 25 సంవత్సరాల క్రితం వారి వ్యాపారాల నిమిత్తం నూజివీడుకి వచ్చారు. అమరావతి ఫర్నిచర్స్ హోమ్ నీడ్స్ షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు.. కానీ, ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో యశ్వంత్ రెడ్డి రూమ్‌లో లేకపోవడంతో ఇంటి చుట్టూ వెతికి చూడగా బిల్డింగ్ పైనుంచి కిందికి పడి ఉండటం గమనించారు .
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
ఇక, యశ్వంత్ రెడ్డి రూమ్ అంతా రక్తపు మరకలతో నిండిపోయి ఉంది. పచ్చడి నూరే రోలుతో తలపై మోది చంపినట్లు తెలుస్తుంది. ఇక, యశ్వంత్ రెడ్డిని కొట్టిన తర్వాత రూమ్ లో నుంచి బయటకు తీసుకువచ్చి మూడవ ఫ్లోర్ నుంచి కింద పడేసినట్టు రక్తపు మరకలు చూస్తే అర్థం అవుతుందంటున్నారు పోలీసులు.. ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ మూర్తి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యశ్వంత్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. అయితే, యశ్వంత్ రెడ్డిని కొట్టి చంపేసింది ఎవరు? అనేది తేల్చే పనిలో పడిపోయారు పోలీసులు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..