Tamilnadu : కాలేజీ ఫీజు కడతామన్నారు.. గదిలో బంధించి అత్యాచారం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి ఆదుకుంటామని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను మూడు రోజుల పాటు హోటల్ గదిలో బంధించి దారుణంగా రేప్ చేశారు. వారి నుంచి అతికష్టం మీద తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారిద్దరిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కొంత కాలం కిందట విడిపోయారు. అయితే కాలేజీలో ఫీజు కట్టాల్సి రావడంతో యువతి తన తల్లిని అడిగింది. తాను ఫీజు కట్టబోనని, తండ్రిని అడగాలని ఆమె సూచించింది. దీంతో ఆ యువతి తన తండ్రిని అడిగింది. అతడు కూడా ఫీజు కట్టేందుకు నిరాకరించాడు.
Also Read
- Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
Read Also: AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్
బాధతో తన పరిస్థితి గురించి తన కాలేజీ స్నేహితుడికి విషయం చెప్పింది. సాయం చేయాలని కోరింది. అతడి ద్వారా ఆమెకు కోయంబత్తూరు జిల్లా కొండయంపాళయంకు చెందిన జర్మన్ రాజేష్, పి రవీంద్రన్ పరిచయం అయ్యారు. వాళ్లు తనకు కాలేజీ ఫీజు కడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువతి వారిని నమ్మింది. ఆమెను ఏప్రిల్ 23న ఇద్దరు నిందితులు ఓ హోటల్ కు తీసుకెళ్లి బంధించారు. మూడు రోజులు పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను బెదిరించారు. అయితే వారి బారి నుంచి యువతి తప్పించుకుంది.
ఏప్రిల్ 26న మహిళా పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హోటల్ కు వెళ్లి చూడగా..వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. తరువాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఓ ప్రదేశంలో పోలీసులు వారిని కనిపెట్టారు. దీంతో నిందితులు భయపడిపోయి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ భవనంపై నుంచి దూకడంతో వారి కాళ్లకు గాయాలు అయ్యాయి. నిందితులిద్దరినీ కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (సీఎంసీహెచ్)లో చేర్చారు. శుక్రవారం వీరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో.. పోలీసులు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Read Also:ROHIT SHARMA : రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్.. తొండాట ఆడిన సంజూ శాంసన్
తాజావార్తలు
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
-
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!