ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
- ఇస్రోకు బిగ్ షాక్
- 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా
- కఠిన ఆంక్షలు విధించిన అంతరిక్ష శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలక ప్రాజెక్ట్‌లు చేపట్టిన సమయంలో ఇస్రోకు శాస్త్రవేత్తలు షాకిచ్చారు. దాదాపు 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్రోలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు స్వచ్ఛంద పదవీ విరమణ, రాజీనామా చేసేందుకు ఇకపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు అంతర్గత మెమోలో పేర్కొంది.

Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
జూలై 14 తేదీతో జారీ చేసిన అంతర్గత మెమో ప్రకారం.. గగన్‌యాన్ సహా ఇతర కీలక అంతరిక్ష మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించబోమని స్పష్టం చేసింది. ఇస్రో నుంచి ఎంతమంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారనే అధికారిక వివరాలను అంతరిక్ష శాఖ వెల్లడించలేదు. అయితే పలు ఇస్రో వర్గాల సమాచారం ప్రకారం 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు ఇప్పటికే రాజీనామా చేయగా లేదా సంస్థను వీడే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో యూ.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC) నుంచి సుమారు 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి కనీసం 20 మంది శాస్త్రవేత్తలు ఉన్నట్లు సమాచారం. కీలక ప్రాజెక్టు డైరెక్టర్లు కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇస్రో వర్గాల ప్రకారం.. రాజీనామా చేసిన వారిలో పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఎల్వీఎం-3 (LVM-3) ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, SpaDeX ప్రాజెక్టు డైరెక్టర్, చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించిన యువ శాస్త్రవేత్త సంస్థను వీడిన వారిలో ఉన్నట్లు సమాచారం.
ఇస్రో ఛైర్మన్ స్పందన
ఈ అంశంపై స్పందించిన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, సంస్థ నుంచి పలువురు శాస్త్రవేత్తలు వెళ్లిపోవడం నిజమేనని అంగీకరించారు. ‘‘ప్రతి సంస్థలోనూ ఉద్యోగులు మారడం సహజమే. అయితే కీలక ప్రాజెక్టులు మధ్యలో దెబ్బతినకుండా ఉండేందుకే ఈ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చాం. ఎవరైనా వెళ్లినా వారి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారు. పరిస్థితిని సమర్థంగా నిర్వహిస్తున్నాం.’’ అని తెలిపారు.
కొత్త నిబంధనలు ఏమిటి?
జూలై 14న జారీ చేసిన మెమో ప్రకారం… గగన్‌యాన్, ఇతర కీలక మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు, వీఆర్ఎస్ దరఖాస్తులను సాధారణంగా ఆమోదించరాదు. సంబంధిత ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అలాంటి దరఖాస్తులకు కేంద్ర డైరెక్టర్లు అనుమతి ఇవ్వకూడదు. ప్రతి దరఖాస్తును డైరెక్టర్ సిఫారసుతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌కు పంపించాలి. తుది నిర్ణయం అంతరిక్ష శాఖే తీసుకుంటుంది.
2020 నిబంధనలకు బ్రేక్
2020 నవంబర్ 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సైంటిస్ట్/ఇంజినీర్-SG స్థాయి వరకు ఉన్న శాస్త్రవేత్తల రాజీనామాలు, వీఆర్ఎస్ దరఖాస్తులను ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు ఆమోదించే అధికారం కలిగి ఉండేవారు. అయితే తాజా ఉత్తర్వులతో గగన్‌యాన్, ఇతర కీలక మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు ఆ అధికారం ఇక వర్తించదని స్పష్టం చేసింది. ఇస్రో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతరిక్ష శాఖ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!