TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
- మమతా బెనర్జీకి మరో షాక్..
- రాజ్యసభ సభ్యత్వానికి కోయెల్ మల్లిక్ రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో రాజకీయ ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తాజాగా ప్రముఖ బెంగాలీ నటి కోయెల్ మల్లిక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె టీఎంసీ తరుఫున నాలుగు నెలల క్రితమే రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇంత తక్కువ సమయంలో పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ చర్చ మొదలైంది.
రెండు రోజుల క్రితం ఆ పార్టీ సీనియర్ నేత మదన్ మిత్రా కూడా పార్టీకి గుడ్ బై చెప్పి రెబల్ వర్గంలో చేశారు. ఇప్పుడు కోయెల్ మల్లిక్ కూడా తన పదవికి రాజీనామా చేయడం మమతకు పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. ఇప్పటికే టీఎంసీ రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బారాయిక్ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రముఖ నటుడు రంజిత్ మల్లిక్ కుమార్తె అయిన కోయెల్ మల్లిక్, బెంగాలీ చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆమె రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!