Post Office Super RD Plan: మధ్య తరగతి కుటుంబీకుల కోసం పోస్టాఫీసు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. తమ జీతం నుండి ఎంతో కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్న వ్యక్తులందరికీ పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి పథకం చాలా మంచి ఎంపిక. ఈ పోస్టాఫీసు ఆర్డీ పథకంలో చాలా తక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి.. ఇది కొన్నేళ్ల తర్వాత భారీ మొత్తంగా మారుతుంది. అంతేకాకుండా, తక్కువ సమయం, పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వారికి ఈ పథకం ఉత్తమమైనది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ గొప్పదనం ఏమిటంటే.. మీరు భవిష్యత్తులో మంచి రాబడితో పాటు హామీ ఇవ్వబడిన డబ్బుకు భద్రతను కలిగి ఉంటారు.
Read Also: Employee Layoff : 200మంది ఉద్యోగులపై వేటు వేసిన ఓలా
రికరింగ్ డిపాజిట్ ప్రయోజనాలు (RD):
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో, మీరు చిన్న పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్ (RD) 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది FD కంటే మెరుగైనది. ఇందులో రోజూ కేవలం రూ.100 ఆర్డీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ మొత్తం సంపాదించవచ్చు.
నెలకు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి?
మీరు పోస్ట్ ఆఫీస్ RD లో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాల తర్వాత మీరు సంవత్సరానికి 5.8శాతం వడ్డీ రేటుతో దాదాపు రూ. 8,14,481 పొందుతారు. అంటే మీకు వడ్డీగా రూ.2,14,481 లభిస్తుంది.
Read Also: 90Days Validity Best Plans : ప్రతీ నెలా రీఛార్జ్ వద్దనుకుంటే.. ది బెస్ట్ 90డేస్ ప్లాన్స్ ఇవే
కేవలం రూ.100తో ఖాతా తెరవండి
పోస్టాఫీసు RD ఖాతాలను 5 సంవత్సరాల కాల పరిమితితో తెరవవచ్చు. ఈ పథకంపై 5.8 శాతం వడ్డీ అందుతోంది. అలాగే, భారత ప్రభుత్వం త్రైమాసికానికి తన చిన్న పొదుపు పథకాలన్నింటి వడ్డీ రేటును ప్రకటిస్తుంది. పోస్టాఫీసు ఆర్డీ పథకంలో కనీసం రూ. 100 పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఈ పథకంలో, స్థిర వడ్డీ ప్రకారం రిటర్న్‌లు ఇవ్వబడతాయి.