Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారుల కసరత్తు!
- జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- యోగాంధ్ర 2025 కోసం సిద్దమైన విశాఖ
- మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారుల కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025లో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్య నమస్కార కార్యక్రమం ఉండబోతుంది. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే.. ఆర్కే బీచ్ రోడ్డులో కార్యక్రమాలు రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది.
వాతావరణం అనుకూలంగా ఉంటే ఆర్కే బీచ్ రోడ్డులో గిన్నిస్ రికార్డు పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏయుకు వచ్చి విద్యార్థుల సూర్య నమస్కారాలను పది నిమిషాల పాటు పరిశీలిస్తారు. ఏజెన్సీ నుండి గిరిజన విద్యార్థులను 106 పాఠశాలల నుంచి 495 బస్సుల్లో విశాఖకు తీసుకువస్తున్నారు. యోగ దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సూర్య నమస్కార కార్యక్రమం నిలవనుంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును ఏపీ ప్రభుత్వం సాధించనుంది. సూర్య నమస్కారాల కార్యక్రమంతో మరో రికార్డు సాధించాలని చూస్తోంది.
Also Read
- Bandla Ganesh: 'పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే'.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
- Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
- APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్..
Also Read: Maoist Aruna: మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!
జూన్ 21న ఉదయం 6.25కు యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. 6.30 నుంచి 6.45కు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం ప్రసంగిస్తారు. ఆపై ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి.. 7.45 వరకు నిర్వహిస్తారు. దాంతో యోగాంధ్ర 2025 ముగుస్తుంది. యోగాంధ్ర 2025 కోసం నేడు ప్రధాని విశాఖకు రానున్నారు.
తాజావార్తలు
-
Bandla Ganesh: ‘పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే’.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
-
Prices Hike : దేశం కొంపముంచనున్న వర్షాలు.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Ravi Teja : రెండు నెలల్లో రెండు సినిమాలు… జోరు మీదున్న రవితేజ
-
Bike Shock Absorbers: బైక్ షాక్ అబ్జార్బర్లు ఎంతకాలం పనిచేస్తాయి? ఎప్పుడు మార్చాలి? ఖర్చు ఎంత?
-
Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!