Purandeshwari: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చేస్తోంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చేసింది.. స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది.. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజు బాధ్యతల నుంచి తప్పుకున్నారు.. మరోవైపు ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్.. జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. పార్టీకి ఇప్పటి వరకు అందించిన సేవలకు నడ్డా ధన్యవాదాలు చెప్పారు. బండి సంజయ్‌తో పాటు.. ఏపీ బీజేపీ చీఫ్‌గా పనిచేసిన సోము వీర్రాజు.. ఇతర రాష్ట్రాల చీఫ్‌లకు ధన్యవాదులు తెలియజేశారు నడ్డా..
Read Also: Ameesha Patel : ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉండటం వల్ల నా కెరీర్ నాశనమైంది..
ఇక, ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటించింది.. మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించారు.. జార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీకి బాధ్యతలు అప్పగించగా.. పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జాఖర్‌ను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.. మొత్తంగా ఒకేసారి నాలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చేసింది కేంద్ర నాయకత్వం. కాగా, సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చిన తర్వాత.. కాపు సామాజిక వర్గానికే ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగింది.. అందుకు అనుగుణంగానే.. కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం.
Read Also: Harbhajan Singh: నిన్న విషెస్.. ఇవాళ ట్రోల్స్.. ఏంటీ భజ్జీ ఇలా చేశావు..!
మరోవైపు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు దగ్గుబాటు పురంధేశ్వరి.. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా సేవలు అందించారు.. 2009 సాధారణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004 లోనూ ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. ఆమె కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖా సహాయమంత్రిగా.. మరోమారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.. ఇక, 2014 లో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఇప్పుడు ఆమెను బీజేపీ ఏపీ చీఫ్ పదవి వరించింది.