UAE Ambassador Meets CM YS Jagan: పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ను పరిగణిస్తున్నట్లు వెల్లడించారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్ అల్షాలి.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్ అల్షాలి.. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. అయితే, ఎలాంటి సహకారం అందించడానికైనా తాము, తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎం జగన్.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఎం.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Read Also: KA Paul: స్టీల్ ప్లాంట్ భూముల్లో వందలాది కంపెనీలు తీసుకొస్తా.. పది లక్షల ఉద్యోగాలిస్తా..!
ఇక, ఫుడ్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వివరించారు యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్ అల్షాలి.. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. కాగా, విశాఖ వేదికగా నిర్వహించిన సదస్సులో పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులకు వివిధ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే.