Thopudurthi Prakash Reddy: చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు.. న్యాయం గెలిచిందా..? రోగం గెలిచిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మధ్యంతర బెయిల్‌పై విడుదల వ్యవహారంలో సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణం అన్న ఆయన.. కోర్టులు ఎక్కడా చంద్రబాబు నేరం చేయలేదని చెప్పలేదు.. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ శ్రేణులు మాత్రం విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఇంతకీ చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా..? రోగం గెలిచిందా? అంటూ ఎద్దేవా చేశారు. మానవతాదృక్పదంతోనే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని.. చంద్రబాబు చిత్ర పటానికి పొట్టేళ్ళను బలి ఇచ్చి.. రక్తం పూసి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నారు.. చంద్రబాబు బయటకు రాగానే జంతు బలులు ఇస్తున్నారు.. చంద్రబాబుకు అధికారం వస్తే ఇంకెంత మందిని బలి ఇస్తారో? అని విమర్శలు గుప్పించారు.
శాశ్వతంగా జైలులో ఉండాల్సిన చంద్రబాబు.. నాలుగు వారాలు వైద్యం కోసం మాత్రమే బయటకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు తోపుదుర్తి.. చంద్రబాబు ఇంకొక పదిహేనేళ్లు బతకాలి.. వైఎస్ జగన్ సీఎంగా ఉండాలన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం.. ప్రజలు వైఎస్ జగన్ ను సీఎంగా గెలిపిస్తారు అని జోస్యం చెప్పారు. వైద్యం కోసం బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలని సెటైర్లు వేశారు. 2024 కురుక్షేత్ర యుద్దంలో కౌరవులకు పట్టిన గతే.. టీడీపీకి పడుతుందన్నారు. తప్పు చేసిన వాళ్లు బయట తిరిగితే.. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయి.. ఈ దేశం పాకిస్థాన్ లా తయారవుతుంది అంటూ సంచలన కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
- సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
- Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
- iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
తాజావార్తలు
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
-
Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!