MLA Chandrasekhar: మీ హయాంలో మీ నాయకుడి సినిమానే వాయిదా వేసుకునే పరిస్థితి..
- హోం మంత్రి అనితకు కులం కోటా లోనే మంత్రి పదవి వచ్చింది
- దళితులను కొడితే హోం మంత్రి కేర్ లెస్ గా మాట్లాడుతున్నారు
- పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలికపై అత్యాచారం చేశారు
- ఇది మీకు కనపడటం లేదా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?
- రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారన్నారు.. హోం మంత్రి అనితకు కులం కోటా లోనే మంత్రి పదవి వచ్చిందని విమర్శించారు. దళితులను కొడితే హోం మంత్రి కేర్ లెస్ గా మాట్లాడుతున్నారన్నారు.. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలిక పై నెలల తరబడి అత్యాచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఘటన మీకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.
READ MORE: Khairatabad Ganesh : ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా ఖైరతాబాద్ గణేషుడు.. ఎన్ని అడుగులంటే..?
Also Read
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ప్రశ్నించారు. “ఇచ్చిన హామీలను అమలు చేయని మీరు వెన్నుపోటు దారులు కాదా? విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది మీరు కాదా? రైతులను మోసం చేసింది నిజం కాదా? మీ నాయకుడు కూడా సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పించారా? పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కి ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేస్తున్నారు.” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
READ MORE: CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రికి హత్య బెదిరింపులు.. నిందితుడి కోసం గాలింపు..
తాజావార్తలు
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!