దర్శకుడు మహి వి రాఘవ్.. వైఎస్ కుటుంబ రాజకీయ ప్రయాణాన్ని వెండితెరపైకి ఆవిష్కరిస్తున్నారు..గతంలో ఈ దర్శకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం పై యాత్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కించి..2019లో ఫిబ్రవరి 8న ఆ సినిమాను విడుదల చేశారు. ఆ సినిమా లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతే కాదు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి యాత్ర సినిమా ఎంతగానో ఉపయోగపడింది.. ఇదిలా ఉంటే యాత్ర సినిమాకు ప్రేక్షకుల ఆదరణ బాగా రావడంతో ఆ దర్శకుడు ‘యాత్ర 2’సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. యాత్ర 2 సినిమా 2024 అనగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల కానుంది..’ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం, ఆయన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా… ఏపీ సీఎం, వైయస్సార్ తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర, జైలు జీవితం ఆధారంగా మహి వి రాఘవ్ ‘యాత్ర 2’ తెరకెక్కిస్తున్నారు.. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్నారు.’యాత్ర’లో వైయస్సార్ రోల్ చేసిన మమ్ముట్టి… ‘యాత్ర 2’లో మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో, నిర్మాత ఆర్బీ చౌదరి తనయుడు అయిన జీవా నటిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారని ఈ రోజు అధికారికంగా వెల్లడించారు.వైయస్సార్ మరణం తర్వాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పేరు గట్టిగా వినిపించింది.జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ ఫస్ట్ లుక్ కనుక చూస్తే… అచ్చం సోనియా గాంధీలా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.సుజనే ఎవరో కాదు హిందీ నటుడు, ఈ ఏడాది మరణించిన అఖిల్ మిశ్రా భార్య.సుమారు 20 ఏళ్ళ నుంచి భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్ మరియు సీరియళ్లు చేస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి సినిమా ‘యాత్ర 2’. ”ఒకవేళ అతనిని ఎదుర్కోలేకపోతే నాశనం చేయండి” అని ఆవిడ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఒక కాప్షన్ వుంది..
Their Paths crossed,
The Dynasty Collapsed,
The History changed !#Yatra2 #Yatra2OnFeb8th #LegacyLivesOn @MahiVraghav @ShivaMeka @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/oAptovTCXg— VcelluloidOfficial (@vcelluloidsoffl) November 7, 2023