దివంగత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో మేటి బ్యాటర్లను కూడా ఇట్టే పెవిలియన్ చేర్చిన ఘనత అతడి సొంతం. వార్న్ లెగ్ స్పిన్ బౌలింగ్‌ను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంతిని అద్భుతంగా తిప్పగలడు, అతడి బంతి గమనాన్ని ఊహించడం కష్టతరం అని ఎందరో పేర్కొన్నారు. 1993లో మైక్ గాటింగ్‌ను బౌల్డ్ చేసిన బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా ఉండడం అతడి బౌలింగ్ నైపుణ్యానికి ఒక ఉదాహరణ. టెస్టుల్లో అత్యధిక వికెట్స్ (708) పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లో ఉన్నాడు.
క్రికెట్ చరిత్రలో గొప్ప లెగ్ స్పిన్నర్లలో ఒకరిగా పేరుగాంచిన షేన్ వార్న్ బౌలింగ్ యాక్షన్ చాలా బిన్నంగా ఉంటుంది. అలాంటి యాక్షన్‌ను ఇప్పటివరకు ఎవరూ వేయలేదు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దాదాపుగా వార్న్ లాగే బౌలింగ్ చేస్తున్నాడు. యశస్వి బౌలింగ్ తీరు వార్న్ యాక్షన్‌ను పోలి ఉంటుంది. యశస్వి గతంలో టెస్ట్, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతదేశం తరపున బౌలింగ్ చేశాడు. తాజాగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Fact Check: స్మృతి మంధాన సిక్స్ ప్యాక్ ఫొటో వైరల్.. ఇది నిజమేనా?
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా యశస్వి జైస్వాల్ బౌలింగ్ చేశాడు. 49వ ఓవర్ బౌలింగ్ చేసి మూడు రన్స్ ఇచ్చాడు. ఆ సమయంలో జాన్ కాంప్‌బెల్, షాయ్ హోప్ క్రీజులో ఉన్నారు. యశస్వి బౌలింగ్ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నెక్స్ట్ షేన్ వార్న్ యశస్వి జైస్వాలే, యశస్వి బౌలింగ్ యాక్షన్ షేన్ వార్న్ లాగే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కుడిచేతి వాటం లెగ్ బ్రేక్ బౌలర్ అయిన యశస్వి లిస్ట్ ఎలో 7 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది.
Next Shame Warne?
pic.twitter.com/UHxZLhdho4— Crictale_Yash (@JaisFanForever) October 12, 2025