దివంగత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో మేటి బ్యాటర్‌లను కూడా ఇట్టే పెవిలియన్ చేర్చిన ఘనత అతడి సొంతం. వార్న్ లెగ్ స్పిన్ బౌలింగ్‌ను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంతిని అద్భుతంగా తిప్పగలడు, అతడి బంతి గమనాన్ని ఊహించడం కష్టతరం అని ఎందరో పేర్కొన్నారు. 1993లో మైక్ గాటింగ్‌ను బౌల్డ్ చేసిన బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా…