టీమిండియా స్టార్ మహిళా ప్లేయర్ స్మృతి మంధాన గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మైదానంలోకి దిగిందంటే పరుగుల వరద పారిస్తుంటుంది. అలవోకగా మ్యాచ్ గమనాన్నే మార్చేస్తుంది. బ్యాటింగ్ నైపుణ్యం, అందంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. స్మృతి అందం, ఆటతీరు.. రెండింటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెను హీరోయిన్‌గా కూడా నటించమని ఫాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆడుతున్న స్మృతి గురించి.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
స్మృతి మంధాన సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో.. ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన స్మృతి తన టీషర్ట్ పైకెత్తి ముఖం తుడుచుకుంటోంది. ఫోటోలో స్మృతి ఆబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్మృతి మంధాన సిక్స్ ప్యాక్ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ ఫొటో అని స్పష్టంగా తెలుస్తోంది. ఏఐ జనరేటెడ్ లేదా ఎడిటింగ్ ఫొటో కావొచ్చు. ఎందుకంటే.. ఏ మహిళా క్రికెటర్ కూడా తమ టీషర్ట్ పైకెత్తి ఆబ్స్ చూపించుకోరు.
స్మృతి మంధాన సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఫొటో ఫేక్ అని ‘గ్రోక్’ స్పష్టం చేసింది. స్మృతి తన సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఫొటోను ఎక్కడా షేర్ చేయలేదని చెప్పింది. దాంతో కొందరు ఆకతాయిలు కావాలనే ఈ ఫోటో క్రియేట్ చేశారని తేలింది. ఇక వన్డే ప్రపంచకప్ 2025లో స్మృతి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (80) చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నయా చరిత్ర సృష్టించింది.