India vs New Zealand: 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ (Basin Reserve) వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు సత్తా చాటారు. 32 ఏళ్ల తర్వాత ఒక అదిరిపోయే రికార్డును ఖాతాలో వేసుకున్నారు. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ (KL Rahul) జోడీ న్యూజిలాండ్ గడ్డపై చాలా కాలంగా ఊరిస్తున్న సెంచరీ భాగస్వామ్యం కలను నిజం చేసి చరిత్ర పుటల్లో నిలిచింది. ముందుగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 368 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత, టీమిండియా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. జైస్వాల్, రాహుల్ తొలుత ఎక్కడా రిస్క్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. క్రీజులో కుదురుకున్నాక నెమ్మదిగా పరుగుల వేగాన్ని పెంచారు. అలా చూస్తుండగానే మొదటి వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు. దీంతో న్యూజిలాండ్‌లో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత్ తరఫున తొలి వికెట్‌కు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో ఓపెనింగ్ జోడీగా వీరిద్దరూ నిలిచారు.
నిజానికి 1994లో హామిల్టన్ టెస్ట్ (Hamilton Test) రెండో ఇన్నింగ్స్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, నయన్ మోంగియా కలిసి తొలి వికెట్‌కు 102 పరుగులు చేశారు. ఆ తర్వాత మళ్లీ 32 ఏళ్ల పాటు న్యూజిలాండ్‌లో ఏ భారత ఓపెనింగ్ జోడీ కూడా సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయలేకపోయింది. ఇప్పుడు జైస్వాల్, రాహుల్ జోడీ ఏకంగా 130 పరుగులు జోడించి ఆ లోటును తీర్చింది. ఇక, న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు మాత్రం మనోజ్ ప్రభాకర్, డబ్ల్యూవీ రామన్ పేరిట ఉంది. వీరిద్దరూ ఫిబ్రవరి 1990లో ఆక్లాండ్ టెస్ట్ (Auckland Test) రెండో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌కు అజేయంగా 149 పరుగులు చేశారు. ఈసారి జైస్వాల్, రాహుల్ ఆ రికార్డును బ్రేక్ చేసేంత దగ్గరకు వచ్చారు. ఇంకొంచెంసేపు ఆడి 150 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసి ఉంటే, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కొత్త రికార్డు నమోదయ్యేది. ఇక ఈ జాబితాలో చేతన్ చౌహాన్, సునీల్ గవాస్కర్ జోడీ మూడో స్థానంలో ఉంది. వీరు 1981లో క్రైస్ట్‌చర్చ్ టెస్ట్‌లో (Christchurch Test) తొలి వికెట్‌కు 114 పరుగులు చేశారు. మరోవైపు భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్‌లను తీసుకుంటే, మొదటి వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం రికార్డు వినూ మన్కడ్, పంకజ్ రాయ్ పేరిట ఉంది. జనవరి 1956లో చెన్నై టెస్ట్‌లో (Chennai Test) వీరిద్దరూ ఏకంగా 413 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే న్యూజిలాండ్‌లో ఏ వికెట్‌కైనా భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం రికార్డు సునీల్ గవాస్కర్, సురీందర్ అమర్నాథ్ పేరిట ఉంది. వీరు 1976 ఆక్లాండ్ టెస్ట్‌లో రెండో వికెట్‌కు 204 పరుగులు జోడించారు.
Also Read
- APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- MLA Adinarayana Reddy: రాజీనామాపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..
- Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
తాజావార్తలు
-
India vs New Zealand: 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు..
-
APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
-
KL Rahul History: తొలి భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర.. దిగ్గజాల వల్లే కాలేదు!
-
Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
-
Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!