Yashasvi Jaiswal Century: చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్.. తొలి ఆటగాడిగా రేర్ రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Slams Maiden T20I Hundred in Asian Games 2023: ఆసియా క్రీడలు 2023 పురుషల క్రికెట్‌లో భాగంగా మంగళవారం ఉదయం నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యువ భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేయడంతో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కీలక పాత్ర పోషించాడు. సూపర్ సెంచరీతో (100: 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన యశస్వి.. 48 బంతుల్లో శతకం అందుకున్నాడు. యశస్వికి ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ. ఈ సెంచరీ ద్వారా యశస్వి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా క్రీడల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా అతడు రికార్డుల్లోకెక్కాడు. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు పురుషల, మహిళలల క్రికెట్‌లో ఎవరూ ఈ ఘనత సాధించలేదు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: MS Dhoni New Look: ఎంఎస్ ధోనీ ‘వింటేజ్’ లుక్.. మహేష్ బాబునే డామినేట్ చేశాడుగా!
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయస్సులో సెంచరీ చేసిన భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ రికార్డుల్లో నిలిచాడు. 21 ఏళ్ల 9 నెలల 13 రోజుల వయస్సులో జైశ్వాల్ ఈ ఘనతను సాదించాడు. అంతకుముందు ఈ రికార్డు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పేరిట ఉంది. గిల్ 23 ఏళ్ల 146 రోజుల్లో సెంచరీ బాదాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా యశస్వి మరో రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో యశస్వి కంటే ముందు సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శుబ్‌మన్ గిల్ ఉన్నారు.
Yashasvi Jaiswal is the first Indian to score century in a T20I match where no one else reached 40.#INDvNEP #AsianGamespic.twitter.com/JJ51OSO6r0
— Kausthub Gudipati (@kaustats) October 3, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!