MS Dhoni New Look: ఎంఎస్ ధోనీ ‘వింటేజ్’ లుక్.. మహేష్ బాబునే డామినేట్ చేశాడుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vintage Look of MS Dhoni Goes Viral: టీమిండియా మాజీ క్రికెటర్ ‘ఎంఎస్ ధోనీ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా మాత్రమే కాదు.. అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) సాదించాడు. మహీ తన ఆట, కెప్టెన్సీతో క్రికెట్‌లో ‘ఐకాన్’గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మూడు సంవత్సరాలు అయినా మహీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాడు.
ఎంఎస్ ధోనీ తన హెయిర్ స్టైల్‌లతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు హెయిర్ స్టైల్‌లు మార్చే ధోనీ.. తాజాగా మరో సరికొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిచ్చాడు. కెరీర్ ఆరంభంలో టార్జన్ తరహా హెయిర్ స్టయిల్‌తో కనిపించిన మహీ.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో మెరిశాడు. ఓ యాడ్ షూట్ కోసం ధోనీ తన తల వెంట్రుకల్ని సరికొత్తగా కట్ చేయించాడు. టాప్ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకిమ్.. ధోనీకి సరికొత్త హెయిర్ స్టైల్ చేశాడు. ఇందుకు సంబందించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో హకిమ్ అప్‌లోడ్ చేశాడు.
Also Read
2007లో వచ్చిన ‘అతిథి’ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హెయిర్ స్టైల్ మాదిరే ఎంఎస్ ధోనీ హెయిర్ స్టైల్ ఉంది. దాంతో మహేష్, ధోనీని పోల్చుతున్నారు. ధోనీ కొత్త హెయిర్ స్టయిల్ ఫోటోలపై ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ధోనీ భాయ్.. సూపర్ హెయిర్ స్టయిల్’, ‘మహీ భయ్యా హెయిర్ స్టయిల్ అదిరిపోయింది’, ‘ఎంఎస్ ధోనీ.. మహేష్ బాబునే డామినేట్ చేశాడుగా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Hydrogen Bus: హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. పిక్స్ వైరల్!
యూఎస్ ఓపెన్ 2023 సమయంలో గుబురు గడ్డంతో కనిపించిన ఎంఎస్ ధోనీ.. ఇటీవల పిలకతో (పోనీటైల్) దర్శనమిచ్చాడు. తాజాగా లూజ్ హెయిర్‌తో బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని.. అచ్చం హీరో మహేశ్ బాబులా కనిపిస్తున్నాడు. ఇక 15 ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.. మహీ ఆటగాడిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. 2024లో చెన్నై జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌లు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Vintage look of Thala Dhoni….!!!! pic.twitter.com/L1skC2TshU
— Johns. (@CricCrazyJohns) October 3, 2023
తాజావార్తలు
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
-
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!