Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులకు ఇది ఒక చేదు వార్త. జూన్ 4, 2026న గ్రాండ్ గా విడుదల కావాల్సిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. ఈ విషయాన్ని యశ్ స్వయంగా ఒక ఎమోషనల్ లెటర్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల జరిగిన సినిమాకాన్ (CinemaCon)లో ‘టాక్సిక్’ కి వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి యశ్ టీమ్ ఆశ్చర్యపోయిందట. ఈ సినిమాకు గ్లోబల్ మార్కెట్ లో ఉన్న పొటెన్షియల్ ను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి పెద్ద ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు.
అందుకని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సంస్థలతో డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలు చేసుకోవడానికి, గ్లోబల్ రిలీజ్ టైమ్‌లైన్‌ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడానికి మరికొంత సమయం అవసరమని యశ్ తెలిపారు. “భారతీయ సినిమా గ్లోబల్ స్టేజ్ పై గర్వపడేలా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని యశ్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే సినిమా షూటింగ్ పూర్తయిందని, అవుట్ పుట్ విషయంలో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నామని యశ్ స్పష్టం చేశారు. “కొన్ని కథలు ప్రయాణాలు ఓపికను కోరుతాయి. మీరు సెలబ్రేట్ చేసుకునే గొప్ప సినిమాను అందిస్తామని ప్రామిస్ చేస్తున్నాను” అంటూ అభిమానులను ఓపిక పట్టాల్సిందిగా కోరారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
— Yash (@TheNameIsYash) April 29, 2026
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!