NTV Telugu Site icon

Yamaha R15M: మార్కెట్లోకి న్యూ R15M బైక్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?

Yamaha R15m

Yamaha R15m

యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు. దీనికి.. వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఈ నమూనాను ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్.. వెనుక వైపు ప్యానెల్‌ల పార్శ్వాలపై చూడవచ్చు. కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ కాకుండా.. R15Mకి ఆల్-బ్లాక్ ఫెండర్, ట్యాంక్‌పై కొత్త డీకాల్స్, సైడ్ ఫెయిరింగ్ అలాగే బ్లూ వీల్స్ కూడా ఉన్నాయి.

PM Modi: గణపతిని కూడా కటకటాల వెనక్కి నెట్టిన ఘనత కాంగ్రెస్‌ది

లుక్ మరియు డిజైన్:
R15Mలో అనేక కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్‌లను కలిగి ఉంది. ఈ ఫంక్షన్లను Y-కనెక్ట్ అప్లికేషన్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ (Android) పరికరాలైన గూగుల్ ప్లే స్టోర్, iOS.. App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను కనెక్ట్ చేయడానికి రైడర్ తన స్మార్ట్‌ఫోన్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఈ మోడల్ మెరుగైన స్విచ్ గేర్, కొత్తగా రూపొందించిన ఎల్ఈడీ లైసెన్స్ ప్లేట్ లైట్‌ని కలిగి ఉంది.

ఇంజిన్ పవర్:
న్యూ R15M బైక్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఈ బైక్.. ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన 155 cc ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 rpm వద్ద 14.2 Nm గరిష్ట టార్క్.. 10,000 rpm వద్ద 18.10 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్, క్విక్‌షిఫ్టర్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ బైక్.. యమహా ట్రాక్షన్ కంట్రోల్.. VVAని కూడా పొందుతుంది.

కంపెనీ అంచనాలు:
యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఇషిన్‌ చిహానా మాట్లాడుతూ, “యమహా బైక్‌లు 2008లో లాంచ్ అయినప్పటి నుంచి తమ థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రసిద్ధి చెందాయి. ఇన్-క్లాస్ పనితీరు, మన అంతర్జాతీయ మోడల్‌లకు బాగా తెలిసిన సూపర్‌స్పోర్ట్ బైక్‌ను ఆస్వాదించడానికి భారతదేశంలోని చాలా మంది వినియోగదారులను ఎనేబుల్ చేసింది.” అని తెలిపారు. న్యూ R15M శక్తివంతమైన ఇంజన్, వినూత్నమైన ఫీచర్లు, రేసీ డీకాల్స్ మరియు స్పోర్టి కార్బన్-ఫైబర్ ప్యాట్రన్డ్ యాక్సెంట్‌లతో ముందుకొస్తుంది. ఈ ఫీచర్లు తమ కస్టమర్లకు నచ్చుతాయని చెప్పారు.