యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు.