Yamaha R15: యమహా మోటార్ భారత మార్కెట్‌లో తన ప్రముఖ ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్స్ బైక్స్ R15 సిరీస్ (R15M, R15 Version 4, R15S)కి కొత్త కలర్ ఆప్షన్లను తీసుక వచ్చింది. అయితే, ఈ సారి మార్పులు కేవలం డిజైన్, కలర్ వేరియంట్స్ లోనే ఉండగా.. ఇంజిన్, ఫీచర్లలో ఎటువంటి మార్పులు లేవు. కొత్త కలర్స్ ను లాంచ్ చేస్తూ, బైక్‌ల ధరలు కూడా ప్రకటించింది. Yamaha R15 సిరీస్ ధరలు ఇప్పుడు రూ.1.67 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానున్నాయి.
Congress vs BJP: బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌పై తీవ్ర దుమారం
R15M ఇప్పుడు కొత్త మెటాలిక్ గ్రే కలర్‌లో లభ్యం అవుతుంది. R15 Version 4 లో కస్టమర్ల డిమాండ్ మేరకు మెటాలిక్ బ్లాక్ కొత్త కలర్ జోడించబడింది. అదనంగా, రేసింగ్ బ్లూ వేరియంట్‌కు రివైజ్డ్ గ్రాఫిక్స్ ఇచ్చారు. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మ్యాట్ పెర్ల్ వైట్ ఇప్పుడు తొలిసారి భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక R15S వేరియంట్ మ్యాట్ బ్లాక్ కలర్‌లో, ఆకర్షణీయమైన వెర్మిలియన్ వీల్స్ తో లాంచ్ అయ్యింది. ఇక ధరల విషయానికి వస్తే R15M ధర రూ. 2,01,000 (ఎక్స్-షోరూం), R15 Version 4 ధర రూ.1,84,770, R15S ధర రూ. 1,67,830 లకు లభ్యం కానుంది.
Theater : సింగల్ స్క్రీన్ థియేటర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
అయితే, మెకానిక్స్ విషయంలో ఎటువంటి మార్పులు లేవు. Yamaha R15 లో 155cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 18HP పవర్ (10,000rpm వద్ద) మరియు 14.2Nm టార్క్ (7,500rpm వద్ద) ఇస్తుంది. ఇంజిన్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. అదనంగా క్విక్-షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. ఈ బైక్ డెల్టాబాక్స్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉండగా, ముందువైపు అప్సైడ్-డౌన్ ఫోర్క్స్, వెనుకవైపు లింక్డ్ మోనోక్రాస్ సస్పెన్షన్ అందించారు. బ్రేకింగ్ సెట్‌అప్‌లో 282mm ముందు డిస్క్ బ్రేక్, 220mm వెనుక డిస్క్ బ్రేక్ కలిపి ABS సేఫ్టీ సిస్టమ్ తో లభిస్తోంది. అదనంగా, రెండు రైడింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.