Xi Jinping: ‘పంచశీల’, ‘అలీన విధానం’పై చైనా అధినేత ప్రశంసలు..
- పంచశీలపై జిన్‌పింగ్ ప్రశంసలు..
- చైనా అధినేత నుంచి భారత్ అనుకూల వ్యాఖ్యలు..
- గ్లోబల్ సౌత్‌పై పట్టుపెంచుకునే ప్రయత్నం..
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అలీన విధానం, పంచశీలను పొగిడారు. ప్రస్తుత వివాదాలను అంతం చేయడానికి, గ్లోబల్ సౌత్ లో పట్టు పెంచుకోవాలని చూస్తున్న చైనా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 71 ఏళ్ల జిన్‌పింగ్ చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో భారతదేశ ‘పంచశీల’ ఒప్పందం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది చైనా-భారత్ రెండు దేశాలు శాంతియుత సహజీవనంతో ఉండేందుకు నెహ్రూ, అప్పటి చైనా నేత చౌఎన్ లై మధ్య కుదిరిన ఒప్పందం. 1954 ఏప్రిల్ 29న ఇరు దేశాలు దీనిపై సంతకం చేశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు పంచశీల రూపుదిద్దుకుంది. అయితే, ఇది అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. 1962 చైనా-భారత్ యుద్ధంతో దీనిని చైనా ఉల్లంఘించింది.
Read Also: JDU Meeting : నేడు ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న నితీశ్ కుమార్
Also Read
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
‘‘శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలు కాలానికి సమాధానమిచ్చాయి. దీని ప్రారంభం అనివార్యమైన చారిత్రక పరిణామం. గతంలో చైనా నాయకత్వం పూర్తిగా 5 సూత్రాలను మొదటగా పేర్కొంది. అవి సార్వభౌమాధికారం మరియు ప్రాదేశికత పట్ల పరస్పర గౌరవం సమగ్రత’, ‘పరస్పర దురాక్రమణ’, ‘ఒకరి అంతర్గత వ్యవహారాల్లో పరస్పరం జోక్యం చేసుకోకపోవడం’, ‘సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం’ మరియు ‘శాంతియుత సహజీవనం’’’ అని జిన్ పింగ్ అన్నారు. ‘‘చైనా-ఇండియా, చైనా-మయన్మార్ సంయుక్త ప్రకటనలో వారు ఐదు సూత్రాలను చేర్చారు. ఇది దేశాల మధ్య సంబంధాల కోసం ప్రాథమిక నిబంధనలను రూపొందించాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది’’ అని జిన్‌పింగ్ అన్నారు. ‘పంచశీల’, శాంతియుత సహజీవనానికి సంబంధించిన ఐదు సూత్రాలు ఆసియా (భారతదేశం)లో పుట్టాయి, త్వరగా ప్రపంచ స్థాయికి ఎదిగాయని 1955లో 20కి పైగా ఆసియా మరియు ఆఫ్రికా దేశాలు బాండుంగ్ సమావేశానికి హాజరయ్యాయని జిన్ పింగ్ తన ప్రసంగంలో గుర్తు చేశారు.
ప్రస్తుతం చైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జిన్ పింగ్ కలల ప్రాజెక్ట్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)’ ద్వారా అనేక దేశాలను కలిపి ఆయా దేశాల మార్కెట్ క్యాప్చర్ చేయాలని భావించిన చైనా యూఎస్, ఈయూ నుంచి వ్యూహాత్మక పోటీ ఎదుర్కొంటోంది. చైనా ఇటీవల సంవత్సరాల్లో గ్లోబల్ సౌత్‌గా పిలుస్తున్న భారత్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో తన ప్రభావాన్ని పటిష్టం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఇలాంటి భారత అనుకూల మాటలు వస్తున్నాయనే అభిప్రాయం ఉంది.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!