WPL 2025: తెలుగమ్మాయికి రూ.55 లక్షలు.. ఎవరీ శ్రీ చరణి?
- డబ్ల్యూపీఎల్ 2025 మినీ వేలం
- భారత అమ్మాయిలపై కాసుల వర్షం
- తెలుగమ్మాయి శ్రీ చరణికి రూ.55 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 మినీ వేలంలో భారత అమ్మాయిలపై కాసుల వర్షం కురిసింది. మహారాష్ట్ర ఓపెనర్ సిమ్రన్ షేక్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. తమిళనాడు బ్యాటర్ కమలిని ముంబై ఇండియన్స్ రూ.1.60 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఉత్తరఖండ్ లెగ్ స్పిన్నర్ ప్రేమ రావత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.1.20 కోట్లకు కైవసం చేసుకుంది. మినీ వేలంలో 124 మంది ప్లేయర్లు అందుబాటులో ఉండగా.. 5 ఫ్రాంఛైజీలు 19 మందిని కొనుగోలు చేశాయి. 19 మంది ఆటగాళ్ల కోసం రూ.9.05 కోట్లు వెచ్చించాయి.
ఇక తెలుగమ్మాయి శ్రీ చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ అయిన చరణి కనీస ధర రూ.10 లక్షలు కాగా.. ఆమె కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ దక్కించుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయుని మండలం ఎర్రమల్లపల్లె గ్రామానికి చెందిన చరణికి చిన్నప్పటి ఆటలంటే ఇష్టం. మేనమామ ప్రోత్సాహంతో క్రికెట్, ఖోఖో, లాంగ్‌జంప్ ఆడేది. క్రీడల్లో చురుగ్గా ఉండే చరణి.. 2016-17లో హైదరాబాదులోని సాయ్ అకాడమీకి ఎంపికైంది. పదో తరగతిలో అథ్లెటిక్స్ విభాగంలో నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాణించింది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అథ్లెటిక్స్ విభాగంలో రాణించినా శ్రీ చరణి మనసు మాత్రం క్రికెట్‌పైనే ఉండేది. అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయిలో రాణించిన చరణి.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. అయితే అందుకు ముందుగా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ చరణి పట్టుదల చూసి ప్రోత్సహించారు. దాంతో ఇంటర్మీడియట్ నుంచి క్రికెట్ కెరీర్‌గా మారింది. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి.. అండర్-19 మహిళల ఛాలెంజర్స్ టోర్నీకి ఎంపికైంది. ఆ టోర్నీలో వికెట్లు తీయడంతో పాటు పరుగులు చేసింది. దాంతో ఆమెకు ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో పంట పండింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..