India Special Mission Iran: తిరుగుబాటు జ్వాలతో ఇరాన్ రగిలిపోతోంది. అమెరికా ఎప్పుడైనా దానిపై దాడి చేయవచ్చనే భయం ఇరాన్‌కు ఉంది. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఇండియా ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భారతదేశానికి తిరిగి రావాలనుకునే ఇండియన్స్‌ను తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది చేయడానికి ప్రభుత్వం ఒక ఆపరేషన్‌ను ప్రారంభిస్తుంది.
READ ALSO: Kotha Malupu: సింగర్ సునీత కొడుకు రెండో సినిమా వచ్చేస్తోంది!
ఇరాన్ తిరుగుబాటు కారణంగా భారతీయ విద్యార్థులను తిరిగి ఇండియాకు తీసుకురావడంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితి గురించి తాను విదేశాంగ మంత్రితో మాట్లాడానని ఆయన తెలిపారు. ఇరాన్‌లో చిక్కుకున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపినట్లు వివరించారు.
ఇరాన్‌లో చదువుతున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇరాన్‌లో విద్యార్థులు సహా దాదాపు 10 వేల మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా. తాజాగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు తిరిగి భారతదేశానికి సురక్షితంగా వెళ్లిపోవాలని కొత్త సలహా జారీ చేశారు.
READ ALSO: Sankranti: కాశీ నుంచి కన్యాకుమారి దాకా.. ఇండియాలో సంక్రాంతి సంబరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసా?