World Cup: 2023 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఈనెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అభిమానులకు పండుగ.. అందులో వరల్డ్ కప్ లో ఈ జట్ల మ్యాచ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం.. టిక్కెట్లు బుక్ చేసుకోగా.. కొంతమందికి దొరకలేదని నిరాశతో ఉన్నారు. ఈ హైఓల్టేజీ మ్యాచ్ కు స్టేడియం వద్ద భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఇండియా- పాకిస్తాన్ మధ్య 2003 నుంచి మొదలుపెడితే 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ లో ఇండియాదే పై చేయి అయింది. అయితే ఇప్పుడు జరిగే మ్యాచ్ కోసం ఇరుజట్లు గెలవాలనే ఆశతో ఉన్నాయి. చూడాలి మరీ 2023 వరల్డ్ కప్ లో ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారో.
2003 వరల్డ్ కప్
2003 వరల్డ్ కప్ లో ఇండియా-పాకిస్తాన్ తలపడిన మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ సయీద్ అన్వర్ 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో జహీర్ ఖాన్ 2, ఆశిశ్ నెహ్ర 2 వికెట్లు తీయగా.. శ్రీనాథ్, దినేష్ మోంగియా తలో వికెట్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్.. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత్ బ్యాటింగ్ లో ఓపెనర్ సచిన్ టెండూల్కర్ 98 పరుగులు చేశాడు. ఆ తర్వాత మహ్మద్ కైఫ్ 35, రాహుల్ ద్రవిడ్ 44, యువరాజ్ సింగ్ 50.. అర్థసెంచరీ చేశారు. ఈ టోర్నీలో సౌరభ్ గంగూలీ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇక 2003 వరల్డ్ కప్ ఫైనల్ మ్యా్చ్ లో ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకోగా.. ఆస్ట్రేలియా గెలుపొంది టోర్నీని సొంతం చేసుకుంది.
2007 వరల్డ్ కప్
2007 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో మధ్యలోనే ఇంటి బాట పట్టా్ల్సి వచ్చింది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈ వరల్డ్ కప్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
2011 వరల్డ్ కప్
2011 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ లో ఇండియా-పాకిస్తాన్ తలపడింది. ఈ మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా.. 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్ లో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 38, సచిన్ టెండూల్కర్ 85 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన గౌతం గంభీర్ 27, కోహ్లీ 9, యువరాజ్ డకౌట్ అయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని 25, సురేశ్ రైనా 36 పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో వహబ్ రియాజ్ 5 వికెట్లు తీయగా, సాయీద్ అజ్మల్ 2, మహమ్మద్ హఫీజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కమ్రాన్ అక్మల్ 19, మహమ్మద్ హఫీజ్ 43, మిస్బా-ఉల్-హక్ 56, ఉమర్ అక్మల్ 29, అసద్ షఫీక్ 30 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, ఆశిశ్ నెహ్ర, మునాఫ్ ఫటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ టోర్నీలో ఫైనల్ లో శ్రీలంకపై ఇండియా భారత్ ఘన విజయం సాధించింది.
2015 వరల్డ్ కప్
న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2015 టోర్నీలో గ్రూప్ దశలో టీమిండియా-పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ 76 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సారథ్య బాధ్యతలు వహించారు. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ 107, శిఖర్ ధావన్ 73, సురేశ్ రైనా 74 పరుగులతో రాణించారు. ఇక పాక్ బౌలర్లలో సోహైల్ ఖాన్ 5 వికెట్లు తీయగా.. వహబ్ రియాజ్ ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత 301 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. 224 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ (76) మినహా.. మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. పాక్ బ్యాటింగ్ లో అహ్మద్ షెజహద్ 47, హ్యారిస్ సోహైల్ 36, షాహిద్ అఫ్రిదీ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, మహమ్మద్ షమీ 4, మోహిత్ శర్మ 2 వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో సెమీ ఫైనల్ వరకు వచ్చిన ఇండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. చివరకు ఆసీస్ జట్టు టోర్నీ గెలుచుకుంది.
2019 వరల్డ్ కప్
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2019 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మధ్య గ్రూప్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 89 పరుగుల తేడాతో పాక్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. మొదటగా భారత్ ను బ్యాటింగ్ కు పంపింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ 140 పరుగులతో విజృంభించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ 77, కేఎల్ రాహుల్ 57 పరుగులు చేశారు. ఇక పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 3 వికెట్లు తీయగా.. వహాబ్ రియాజ్, హసన్ అలీ తలో వికెట్ తీశారు. 302 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. డక్ లూయిస్ పద్ధతి ప్రకారం 40 ఓవర్లలో 212 పరుగులు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించి భారత్ అలవోక విజయాన్ని అందుకుంది. ఇక భారత్ బౌలర్లలో విజయ్ శంకర్ 2, కుల్దీప్ యాదవ్ 2, హార్థిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. సెమీఫైనల్ వరకు చేరుకున్న భారత్.. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రపంచ కప్ ను ఎగరేసుకుపోయింది.