NTV Telugu Site icon

World Cup 2023: జట్టులో నేను లేను.. వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూడొద్దనుకున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma Cwc 2023

Rohit Sharma Cwc 2023

India Skipper Rohit Sharma recalls 2011 WC Disappointment: 2011లో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో శ్రీలంకపై గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఆ జట్టులో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లతో పాటు అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే 2007 టీ20 ప్రపంచకప్‌ ఆడిన రోహిత్ శర్మకు మాత్రం మెగా టోర్నీలో ఆడే అవకాశం రాలేదు. దీంతో అసంతృప్తికి గురైన రోహిత్.. ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూడొద్దనుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.

12 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగుతోంది. ఇప్పటికే మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసిన ఐసీసీ.. ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌ ప్రచార కార్యక్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ… ‘2003 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ వరకు చేరడం, 2007లో విఫలం కావడం నాకు ఇంకా గుర్తున్నాయి. అయితే 2011 ప్రపంచకప్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇంట్లో నుంచే ఆ మ్యాచ్‌లను వీక్షించా. అప్పుడు నేను రెండు రకాలుగా భావోద్వేగానికి గురయ్యా. నేను జట్టులో లేకపోవడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యా. ముందుగా మ్యాచ్‌లను చూడొద్దనుకున్నా. కానీ భారత్ అద్భుతంగా ఆడడంతో చూడకుండా ఉండలేకపోయా’ అని తెలిపాడు.

Also Read: Nicholas Pooran Fine: పూరన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే!

‘2011లో ఆడకున్నా.. 2015, 2019 ప్రపంచకప్‌లో బరిలోకి దిగా. రెండుసార్లూ సెమీస్‌కు చేరుకున్నాం. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్ చేరలేదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగుతోంది. 2016 టీ20 ప్రపంచకప్‌ జరిగినా.. వన్డే టోర్నీకి ఉండే ప్రత్యేకత వేరు. ఫాన్స్ ఎంతో ఉత్సాహంగా టోర్నీ కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఇంత దగ్గరగా ట్రోఫీని చూడడం ఇదే మొదటిసారి. టీమిండియాను విజేతగా నిలిపేందుకు అందరం ప్రయత్నిస్తాం. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తేనే కప్ గెలవగలం. జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.

Show comments