NTV Telugu Site icon

Caste Enumeration : తెలంగాణలో కులగణన విధివిధానాలపై కసరత్తు

Caste Enumeration

Caste Enumeration

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేయడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కుల గణన పై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు , సభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్‌లో టెండర్లు..

ప్రభుత్వం బీసీల్లో రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కుల గణన కోసం అసెంబ్లీలో ,క్యాబినెట్ లో కూడా తీర్మానం చేసింది. అయితే కుల గణన ఎలా చేయాలి అనే దానిపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేసిన కుల గణన పై అధ్యయనం చేశారు. కర్ణాటక , బీహార్, ఆంధ్రప్రదేశ్ లో చేసిన కుల గణన పై సమావేశంలో చర్చించారు. కర్ణాటక లో బీసీ కమిషన్ చేసిన సర్వే , బీహార్ లో జీఏడి ద్వారా చేసిన సర్వే , ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ద్వారా సర్వే చేసిన అంశాల పై చర్చించారు. అక్కడ డోర్ టూ డోర్ పూర్తి స్థాయి సర్వే నిర్వహించారు. ఇందులో మూడు రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీ నీ తీసుకొని ఇక్కడ అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా మాదిరి.. వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌!

మరోవైపు ఎస్సి వర్గీకరణ కు సుప్రింకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం ప్రభుత్వం వర్గీకరణ మీద సబ్ కమిటీ సమావేశాలు కొనసాగుతుండటంతో కుల గణన సర్వే నివేదిక ఎస్సి వర్గీకరణ కు కూడా అవసరం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి కులాల గణన చేసి వారికి అవసరమైన డేటా తీసుకునేలా చేసే అంశం పై చర్చించారు. రిపోర్ట్ పారదర్శకంగా ఉండడానికి ఇరు శాఖలకు సంబంధం లేకుండా కుల గణన జీఏడీ లేదా పంచాయతీ రాజ్ , రెవెన్యూ లో దేని ద్వారా చెపించాలనే దానిపై రెండు రోజుల్లో సీనియర్ మంత్రులతో ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేయనుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కుల గణన కు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో మానిటరింగ్ చేసేలా చూడాలని సూచించారు. కుల గణన ప్రారంభమై నెల రోజుల్లో పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.