స్టేటస్‌కు సంబంధించి రెండు కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌

వాట్సాప్‌ స్టేటస్‌లో తీసుకొస్తున్న ఫీచర్లలో 'ప్రైవేట్ మెన్షన్' ఒకటి

ఈ ఫీచర్‌తో స్టేటస్‌ను పోస్ట్ చేసే సమయంలో మరో యూజర్‌ను ట్యాగ్ చేయొచ్చు

మీరు ట్యాగ్ చేసిన విషయం కేవలం వారికి మాత్రమే తెలుస్తుంది

వాట్సాప్‌ తీసుకొస్తున్న మరో అప్‌డేట్‌ 'రీషేర్‌' ఫీచర్‌

ఓ యూజర్ పోస్ట్ చేసిన స్టేటస్‌ని రీషేర్ ఫీచర్‌ ద్వారా మీ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు

త్వరలోనే ఈ రెండు ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి