Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా మరో నాలుగు రోజుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను ముద్దాడని భారత జట్టు, ఈసారి ఎలాగైనా ఇంగ్లాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాలని కసితో ఉంది.
ఫామ్‌లో టీమిండియా..
గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను వారి సొంతగడ్డపైనే టీ20 సిరీస్‌లలో ఓడించి భారత్ తన సత్తా చాటింది. దీనికి తోడు అండర్-19 ప్రపంచకప్ గెలవడం, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా భారత ఆటగాళ్లు మరింత రాటుదేలడంతో ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అయితే, ఈ మెగా టోర్నీకి సరిగ్గా ముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో భారత్ ఓటమి పాలవ్వడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్-Aలో చోటు సంపాదించింది. ఇక్కడ సెమీఫైనల్ చేరడం అంత సులువేం కాదు. ఎందుకంటే పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లతో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. కొందరు కీలక ఆటగాళ్లు ఫామ్ లేమితో సతమతమవుతుండగా, మరికొందరు ఆల్‌రౌండర్లు గాయాల బారిన పడటం జట్టును కాస్త కలవరపెడుతోంది.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Playing XIలో చోటు దక్కేది వీళ్లకే..
ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా ఠాకూర్, నందిని శర్మ ఉన్నారు. వీరిలో షెఫాలీ, స్మృతి, జెమిమా, హర్మన్‌ప్రీత్, రిచా, భారతి, దీప్తి, అరుంధతి, శ్రీ చరణిలతో పాటు శ్రేయాంక లేదా నందిని శర్మలలో ఒకరికి, అలాగే రేణుకా ఠాకూర్‌కు తుది జట్టు (Playing XI)లో చోటు దక్కే అవకాశం ఉంది.
ఈ టోర్నీలో భారత మిడిలార్డర్ భారం అంతా జెమిమా రోడ్రిగ్స్పైనే ఉంది. 25 ఏళ్ల జెమిమాకు ఇంగ్లాండ్ పిచ్‌లపై అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ ఆడిన 13 అంతర్జాతీయ టీ20ల్లో ఆమె 130.25 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టింది. అలాగే, 21 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీ చరణి భారత్‌కు ఎక్స్-ఫ్యాక్టర్ కానుంది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఇటీవలి మ్యాచ్‌లలో ఆమె వరుసగా వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, దాదాపు తొమ్మిది నెలల తర్వాత జట్టులోకి వచ్చిన యాస్తికా భాటియా ఇంగ్లాండ్‌పై నంబర్-3లో బ్యాటింగ్‌కు దిగినా, పవర్‌ప్లే తర్వాత ఆమె నెమ్మదిగా ఆడటం యాజమాన్యానికి పెద్ద సమస్యగా మారింది. మరోవైపు, హిట్టర్ రిచా ఘోష్ బ్యాట్ కూడా ఇటీవలి మ్యాచ్‌లలో పెద్దగా పలకలేదు.
రికార్డ్‌లకు చేరువలో ప్లేయర్స్..
ఇక, గత 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం గ్రూప్ స్టేజ్‌లోనే ముగిసింది. అప్పట్లో కేవలం పాకిస్థాన్, శ్రీలంకలపై మాత్రమే గెలిచిన భారత్, ఆ తర్వాత పుంజుకుని వెస్టిండీస్, శ్రీలంకలను సొంతగడ్డపై ఓడించింది. కానీ, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో లారా వోల్వార్ట్ జట్టు చేతిలో 1-4తో ఘోరంగా ఓడిపోవడం భారత లయను దెబ్బతీసింది. అందుకే జూన్ 21న దక్షిణాఫ్రికాతో జరిగే లీగ్ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ ఫలితమే సెమీఫైనల్ రేసును నిర్ణయించవచ్చు. మరోవైపు, ఈ టోర్నీ కొందరు భారత ఆటగాళ్లకు వ్యక్తిగత మైలురాళ్లను అందించబోతోంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 4500 పరుగుల మార్కును అందుకోవడానికి వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు కేవలం 167 పరుగులు మాత్రమే కావాలి. ఈ ఘనత సాధిస్తే ప్రపంచంలోనే ఈ మైలురాయిని చేరిన రెండో బ్యాటర్‌గా ఆమె రికార్డు సృష్టిస్తుంది. అలాగే, బౌలర్ అరుంధతి రెడ్డి తన 50 అంతర్జాతీయ టీ20 వికెట్ల మార్కును అందుకోవడానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉంది.
గతంలో కప్పు సాధించిన జట్లు ఇవే..
ఇక ఈ వరల్డ్ కప్‌లో టీమిండియాపై అభిమానుల్లో, విశ్లేషకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కనీసం ఫైనల్ చేరకుండా భారత్ వెనుదిరిగితే అది పెద్ద నిరాశే మిగులుస్తుంది. అయితే, లీగ్ దశలోనే భారత్‌కు గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమయ్యే లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ పరిశీలిస్తే… జూన్ 14న పాకిస్థాన్‌తో (బర్మింగ్‌హామ్), జూన్ 17న నెదర్లాండ్స్‌తో (లీడ్స్), జూన్ 21న దక్షిణాఫ్రికాతో (మాంచెస్టర్), జూన్ 25న బంగ్లాదేశ్‌తో (మాంచెస్టర్), జూన్ 28న బలమైన ఆస్ట్రేలియాతో (లండన్ – లార్డ్స్) భారత్ తలపడనుంది. ఇక, 2009లో ప్రారంభమైన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రను ఒకసారి గమనిస్తే, ఇప్పటివరకు 9 సార్లు ఈ టోర్నీ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచి రికార్డు స్థాయిలో 6 సార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023) టైటిల్ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ (2009), వెస్టిండీస్ (2016), న్యూజిలాండ్ (2024) చెరోసారి ట్రోఫీని గెలుచుకున్నాయి. భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవనప్పటికీ, 2020లో రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్ జట్ల విషయానికొస్తే.. న్యూజిలాండ్ (2009, 2010), ఇంగ్లాండ్ (2012, 2014, 2018), ఆస్ట్రేలియా (2016), భారత్ (2020), దక్షిణాఫ్రికా (2023, 2024)లు ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాయి. ఈసారి ఆ రన్నరప్ ముద్రను చెరిపేసి, సరికొత్త విజేతగా నిలవాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!