Women’s T20 World Cup: ‘జట్టులోకి ఆమె రావడంతో బలం పెరిగింది.. టీ20 ప్రపంచకప్ భారత్‌దే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టులో ఏలాంటి సవాలునైనా ఎదుర్కొని గెలవగలమనే నమ్మకం, ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యాయని భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మజుందార్ స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న 2026 మహిళా టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే హైవోల్టేజ్ పోరుతో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ మజుందార్ జట్టు సన్నద్ధత, వ్యూహాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆ ఫార్మాట్ వేరు..
గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా భారత జట్టు దశాబ్దాల నిరీక్షణకు తెరదించిందని మజుందార్ గుర్తు చేశారు. “ఇది పూర్తిగా భిన్నమైన టీ20 ఫార్మాట్. మేము గతంలో గెలిచింది వన్డే ప్రపంచకప్ అయినప్పటికీ, ఆ టోర్నీ విజయం నుండి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎలా పోరాడాలి, ఒత్తిడిని అధిగమించి ఎలా విజయం సాధించాలనే విషయంపై ఆటగాళ్లందరికీ ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
వాతావరణ పరిస్థితులకు అలవాటు పడ్డాం
మెగా టోర్నీ కోసం భారత జట్టు గత మూడు వారాలుగా బ్రిటన్‌లోనే ఉంటూ స్థానిక వాతావరణానికి అలవాటు పడిందని కోచ్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడటం కూడా జట్టుకు బాగా కలిసివచ్చిందని, ఇక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చేసిందని ఆయన పేర్కొన్నారు.
యాస్తికా భాటియా పునరాగమనంపై సంతోషం..
గత వన్డే ప్రపంచకప్ ప్రాక్టీస్ క్యాంప్ చివరి రోజున మోకాలి గాయంతో టోర్నీకి దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా తిరిగి జట్టులోకి రావడంపై కోచ్ సంతోషం వ్యక్తం చేశారు. “యాస్తికా చివరి నిమిషంలో గాయపడటం చాలా దురదృష్టకరం. కానీ ఆమె ఆ తీవ్రమైన గాయం నుండి కోలుకుని అంతకంటే బలంగా జట్టులోకి తిరిగి వచ్చిన తీరు అద్భుతం. సవాళ్లను ఎలా ఎదుర్కొవాలనే దానికి యాస్తికా ఒక గొప్ప ఉదాహరణ” అని కొనియాడారు.
కేవలం స్పిన్ పైనే ఆధారపడటం లేదు..
భారత జట్టు బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు టీమిండియా కేవలం స్పిన్నర్లపైనే ఎక్కువ ఆధారపడేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని మజుందార్ చెప్పారు. ప్రస్తుతం జట్టులో ఎనిమిది మంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారని, అందులో మేటి స్పిన్నర్లతో పాటు నాణ్యమైన పేసర్లు కూడా ఉన్నారని తెలిపారు. బౌలింగ్ విభాగంలో ఉన్న ఈ వైవిధ్యం జట్టుకు పెద్ద బలమని, ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!