ప్రతి కవి ఆడవారిని ఎంతో గొప్పగా వర్ణిస్తాడు.. కవితలు మాత్రమే కాదు పాటలు కూడా ఉన్నాయి.. ఆమె లేనిదే మనుగడ లేదు.. మరో జీవి ప్రాణం పోసుకోదు.. అమ్మగా, చెల్లిగా, బిడ్డగా ఇలా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సందర్భంగా స్త్రీల ఔనత్యాన్ని, మహిళల విశిష్టతను, గొప్పదనాన్ని వివరించే తెలుగు సినిమా పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం..
గుండమ్మ కథ సినిమాలోని లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట.. ఈ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.. అందరు దాదాపు ఈ సినిమాను మర్చిపోయారు.. కానీ ఈ పాట మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది.. ఆ పాటను మరోసారి విందామా..
అమ్మ రాజీనామా సినిమాలోని ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న తియ్యని కావ్యం’, ‘సృష్టికర్త ఒక బ్రహ్మ’ పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. కె. చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఈ పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు… ఈ పాట ఇప్పటికి వినిపిస్తుంది అంటే ఆ పాట అర్థం అందరిని కదిలించింది..
రజినీకాంత్ దళపతి సినిమా గుర్తుకు ఉంది కదా.. ఆ సినిమాలోని ఆడజన్మకు ఎన్ని సోకాలో అనే పాట లిరిక్స్ అందరిని తెగ ఆకట్టుకుంది.. ఇప్పటికి ఆ పాట వినిపిస్తుంది..
పవిత్ర బంధం సినిమాలోని అపురమైనదమ్మ ఆడజన్మ సాంగ్ విని ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు.. కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభ’ అంటూ సాగే ఈ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం రాశారు.. ఆ పాట ఇప్పటికి వినిపిస్తుంది..
‘వకీల్ సాబ్’. ఇందులో ఎస్ తమన్ స్వరపరిచిన ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’ ‘కదులు కదులు’ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్త్రీ గొప్పతనాన్ని చాటిన ఈ పాట ఇప్పటికి వినిపిస్తుంది.. ఇవే చాలా పాటలు ఉన్నాయి..
ఇవన్నీ కూడా ఆడవారి గొప్పతనాన్ని వివరించాయి.. హ్యాపీ ఉమెన్స్ డే..