MP Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ నెల 27 (బుధవారం) చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన బండి సంజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది.