Site icon NTV Telugu

AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..

Ap Crime

Ap Crime

AP Crime: గుట్టుగా సాగుతోన్న వ్యవహారం బట్టబయలు అయ్యింది.. తలెత్తుకుని కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేకపోయారు.. ఇంతకంటే తమ ప్రాణాలు విడిచిందే మంచిదనే నిర్ణయానికి వచ్చారేమో.. ఆ వదిన, మరిది.. రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లులో వెలుగు చూసింది.

Read Also: Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..

అనంతపురం జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాష, గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన నిజామ… వదిన, మరిది అవుతారు.. అయితే, రెండు రోజుల క్రితం ఇరువురు ఇంటినుండి వెళ్లిపోయారు.. ఆదివారం సాయంత్రం చాగల్లు రిజర్వాయర్ వద్ద మోటార్ సైకిల్, అందులో మొబైల్ ఫోన్ ఉండడంతో చాగల్లు డ్యామ్ వద్ద ఉన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా నిజామ భర్త జిలాన్‌ ఫిర్యాదు మేరకు.. పెద్దపప్పూరు ఎస్సై గౌస్ మహమ్మద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం చాగల్లు రిజర్వాయర్ లో ఓ మహిళ శవం తేలడంతో.. బంధువులతో కలిసి ఎస్సై సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతి చెందిన మహిళ నిజామ అని గుర్తించారు. జిలాన్ ఆటో తోలుకుంటూ గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో జీవనం సాగిస్తున్నారు.. వారికి 16 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల అబ్బాయి ఉన్నారు. జిలాన్ కు సొంత తమ్ముడు అయిన మహబూబ్ బాష, నిజామ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని.. ఈ విషయం బహిర్గతం కావడంతో ఇద్దరు కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు.. ఇక అదే రిజర్వాయర్‌లో మహబూబ్ బాషా మృతదేహం లభ్యమైంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version