Woman Stoned To Death: వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను రాళ్లతో కొట్టి చంపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Stoned To Death: వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఒక మహిళలను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ అమానుష ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన లాహోర్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని రాజన్‌పూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. బాధితురాలిని స్వయంగా ఆమె భర్త, అతని ఇద్దరు సోదరులు కలిసి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారని, రాళ్లతో కొట్టి చంపారని పోలీసులు వెల్లడించారు. నేరం చేసిన తర్వాత సోదరులు పారిపోయారని, పంజాబ్, బలూచిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బట్టబయలు.. కారులోనే మొబైల్ ఫోన్లు పెట్టి..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
పరువు హత్య పేరుతో మహిళలను కొట్టిచంపిన ఘటన పాకిస్థాన్‌లో ఇదే మొదటిది కాదు. పాకిస్థాన్‌లో పరువు పేరుతో ఏటా అనేక మంది మహిళలు హత్యకు గురవుతున్నారు. మానవ హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం 1,000 మంది మహిళలు గౌరవం పేరుతో చంపబడుతున్నారు. బాధితులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం లేదా అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా వారి కుటుంబాలకు అవమానం, పరువు పోతోందని కారణంతో ఈ దారుణాలకు ఒడుగడుతున్నారు. వీటిలో కుటుంబ సభ్యులే ఈ తరహా హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అధికంగా ఉండడం గమనార్హం.
కొద్దిరోజుల క్రితమే, 25 ఏళ్ల వైద్యురాలు పరువు హత్యకు గురైంది. తన సహోద్యోగిని పెళ్లి చేసుకోవాలని వైద్యురాలు అనుకోగా.. అందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు వైద్యశాలకు వచ్చిన ఆమె తండ్రి వాగ్వాదానికి దిగాడు. కోపంతో రెచ్చిపోయిన తండ్రి తుపాకీ తీసి కూతుర్ని కాల్చి చంపేశాడు. పాకిస్థా్న్‌లో మహిళల దయనీయ పరిస్థితికి ఈ పరువు హత్యలు అద్దంపడుతున్నాయని, మహిళలను రెండో తరగతి పౌరులుగా చూస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా దాడులు ఎక్కువ అవుతుండడంతో మహిళా భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!