Viral News: ఒకప్పుడు తెలిసినవారి ద్వారా సంబంధాలు చూసేవారు.. పురురోహితులు కూడా సంబంధాలు చూసిపెట్టేవారు.. ఇక, ఇప్పుడు మొత్తం మ్యాట్రిమోనీ సైట్లదే హవా.. వయస్సు, చదువు, ఉద్యోగం, జీతం.. తదితర వివరాలను పేర్కొంటూ మ్యాట్రీమోనీ సైట్లలో నమోదు చేసుకోవడం.. నచ్చిన మ్యాచ్ కోసం చూస్తున్నారు.. అయితే, ఓ యువతికి ఏకంగా 14 మ్యాచ్‌లు వచ్చాయట.. కానీ, ఎవరిని చేసుకోవాలి అనే విషయంలో మాత్రం.. ఆ అమ్మాయి ఓ నిర్ణయానికి రాలేకపోయింది.. దాంతో.. అందరి ప్రొఫైన్స్‌ను తీసి సోషల్ మీడియాలో పెట్టి.. ఎవరు బెటరో చెప్పండి అంటూ.. నెటజన్లకు ఓ ప్రశ్న వేసింది.. ఆ యువతి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 29 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.. వెంటనే మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.. బీకాం వరకు చదివిన ఆమె.. ప్రస్తుతం ఖాళీగానే ఉంటుందట.. అయితే, తక్కువ సమయంలోనే మ్యాట్రిమోనీలో అమ్మాయిగానే బాగానే సంబంధాలు వచ్చాయి.. ఏకంగా 14 మ్యాచ్‌లు వచ్చాయట.. అందులో కొందరు బాగా ఉద్యోగం చేస్తూ బాగా సెటిల్ అయినవారు.. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. ఇలా వివిధ వృత్తుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు.. కొందరు బాగానే సంపాదిస్తుంటే.. కొందరు పర్వాలేదు అనేస్థాయిలో ఉన్నారు.. అయితే, ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయిన ఆ యువతి.. వారి ప్రొఫైల్స్ స్థూలంగా వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.. ఇక, అందులో తనను ఇష్టపడేవారు.. తాను ఇష్టపడేవారి వివరాలను కూడా రాసుకొచ్చింది.. వీరిలో ఎవరు తనకు తగిన జోడీనో చెప్పండంటూ నెటిజన్లను కోరింది. ఇక, ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. రెచ్చిపోయే నెటిజన్లు.. తకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు..
చూడండి ఈ కాలంలో అబ్బాయిల పరిస్థితి ఎలా తయారైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.. అమ్మాయి చదివింది బీకాం.. ఖాళీగానే ఉంది.. కానీ, వైద్యులు, ఇంజినీర్లు.. మంచి జీతాలు తీసుకునేవాళ్లు కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చిందే? అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.. మొత్తంగా.. ఆ యువతి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
https://twitter.com/TheSquind/status/1680884279897886721