ఆంటీ.. ఈ పదం అంటే అమ్మాయిలకు ఎంత చిరాకంటే దానిని మాటల్లో కూడా వర్ణించలేం. ఎవరైనా ఆంటీ అనిపిలిస్తే చాలా చిర్రెత్తుకొస్తుంది. ఈ ఆంటీ వివాదం మొన్నీమధ్య టాలీవుడ్ లో కూడా దుమారం రేపింది. ప్రముఖ యాక్టర్, యాంకర్ అనసూయ ఈ విషయంలో చాలా ఫైర్ అయ్యారు కూడా. రీసెంట్ గా హీరోయిన్ ప్రియమణి కూడా ఇలాంటి కామెంట్లపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఓ వార్త ప్రకారం ఆంటీ అన్నందుకు ఓ మహిళ వ్యక్తిని చెప్పుతో కొట్టి దాడి చేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. వ్యక్తిని చెప్పుతో కొట్టి దాడి చేయడంతో ఆమెపై పోలీస్ కేసు నమోదయ్యింది.
Also Read: Largest Hindu Temple : అమెరికాలోని అతి పెద్ద హిందూ దేవాలయం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఓ మహిళ కర్నాటకలోని బెంగళూరులో ఉన్న ఒక ఏటీఎం సెంటర్ కు వెళ్లి నగదు విత్ డ్రా చేసింది. తరువాత అక్కడే క్యాబిన్ డోర్ వద్ద నిలబడి ఉంది. దీంతో అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు ఇతర కస్టమర్లు ఇబ్బంది పడటంతో పక్కకు తప్పుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో అతడు ఆ మహిళను ఆంటీ కొంచెం పక్కకు తప్పు్కోండి అని అన్నాడు. ఆంటీ అనడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఎవర్రా ఆంటీ అంటూ చెప్పుతీసి మరీ అతనిపై దాడి చేసింది. దీంతో అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఆంటీ అని పిలవడంతో ఆమె అతనిపై దాడి చేసిందని అక్కడున్న వారు చెబుతున్నారు. ఆ సమయంలో ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుందని కొందరు అనుకుంటున్నారు. అయితే ఈ కోణం ఇంకా విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఆంటీ అని పిలిచిన సెక్యూరిటీ గార్డ్ కు పెద్దగా గాయాలు కాలేదు. పోలీసు ఆ మహిళను అరెస్ట్ చేయగా వెంటనే బెయిల్ పై విడుదల అయ్యింది.