Love Dispute: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రియుడిపై కోపంతో అతడి ఇంటిపై ప్రియురాలు పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో పెద్ద పెద్దగా కేకలు వేయడంతో మంటలను ఆర్పేందుకు గ్రామస్థుల్లో ప్రయత్నించారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
Read Also: Deputy CM Pawan: నేడు నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
ఇక, ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే చేబ్రోలు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ప్రియురాలు దుర్గాను అదుపులోకి తీసుకుని.. గ్రామంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.