Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక మహిళ హింసకు గురవుతుంది. గ్యాంగ్ రేప్ లు, మహిళలను హత్య చేయడం, చిన్నారులపై దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా ఈ దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పశువులు రెచ్చిపోతూనే ఉంటున్నాయి. సినిమాలో డైలాగ్ లాగా నిజంగానే ఆడదంటే ఆట బొమ్మలానే మారినట్లు అనిపిస్తోంది జరుగుతున్న ఈ ఘటనలు అన్నీ చూస్తుంటే. తాజాగా ఓ మహిళను రేప్ చేసి చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది.
Also Read: US University: అమెరికాలో కాల్పుల కలకలం..ప్రొఫెసర్ బలి
వివరాల ప్రకారం 19 ఏళ్ల ఓ యువతి ఘజియాబాద్ లోని ఓ హౌసింగళ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. అయితే ఆమెను ఆదివారం ఆమెను ఎవరో రేప్ చేశారు. సోమవారం ఆ మహిళ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. అయితే ఈ ఘటనలో బిల్డింగ్ సూపర్ వైజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిల్డింగ్ పార్కింగ్ బేస్ మెంట్ లో నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ముగ్గురు వ్యక్తులు తమ కుమార్తెను రేప్ చేసి ఆమెను తీవ్రంగా కొట్టారని ఆ మహిళ తల్లిదండ్రులు తెలిపారు. అయితే తనపై రేప్ జరిగిన వెంటనే ఆ మహిళ విషం తాగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే కేసును విచారిస్తున్న పోలీసులు ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదని పేర్కొన్నారు. బేస్ మెంట్ లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదనే విషయం అర్థం అవుతుందని వారు పేర్కొ్న్నారు. ఇక ఆమెకు అంతకముందే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండటంతో ఆమె విషం కారణంగా చనిపోయిందా లేదంటే ఆరోగ్యసమస్యతో చనిపోయిందా అనే విషయాన్ని నిర్థారించుకోవడానికి పోస్ట్ మార్టం చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు.