Firing in America: అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అగ్రరాజ్యంలో దుండగుల ఆగడాలు ఆగడం లేదు. జాతి విద్వేషం కారణంగా ఎన్నోసార్లు కాల్పులు జరిగిన ఘటనలు ఎన్నో చూశాం. గన్ లు, ఆయుధాలు విరివిగా లభించడం కారణంగా కూడా ఈ నేరాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఘటనల్లో ఎటువంటి కారణం లేకుండా కూడా కాల్పులకు తెగబడిన ఉదాాంతాలు ఉన్నాయి. ఇవి చూస్తుంటే మనుషుల్లో నేర ప్రవృత్తి ఎంతలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారు కొన్ని సందర్భాల్లో ఇతరులకు హత్య చేసిన వెంటనే తమని తాము కాల్చకొని కూడా చనిపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
Also Read: Viral Video: పరీక్షల్లో కూతురికి వచ్చిన సున్నా మార్కులు.. ఆ తల్లి ఏం చేసిందో అస్సలు ఊహించలేరు
తాజాగా జరిగిన కాల్పుల్లో ఓ ప్రొఫెసర్ ప్రాణాలు కోల్పొయారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. వివరాల ప్రకారం నార్త్ కరోలినాలోని చాపెల్ హిల్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. యూనివర్శిటీలోని సైన్స్ భవనంలో కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఓ ఫ్రొఫెసర్ చనిపోయారు. అయితే ఈ ఘటనలో ఇంకెవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీన్ని బట్టి చూస్తే కేవలం ప్రొఫెసర్ పై మాత్రమే ఈ దాడి జరిగిందేమో అనిపిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని నేరానికి పాల్పడింది అతనా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు గంటల తరువాత నిందితుడిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే యూనివర్శిటి క్యాంపస్ లో లాక్ డౌన్ ఎత్తివేసిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది. చదువుకునే చోట ఇలా కాల్పులు జరగడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది మాత్రమే గత శనివారం కూడా అమెరికాలో కాల్పులు జరిగాయి. జాతి విద్వేషం కారణంగా ముగ్గురు నల్లజాతియులపై దాడి చేసి ఓ వ్యక్తి వారిని కాల్చి చంపాడు. ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం నిందితుడు కూడా తనని తాను కాల్చుకొని చనిపోయాడు.