మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన జరిగిన అత్యాచార ఘటన కలకలం సృష్టించింది. అత్యాచారం వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటనను చూసి ఆపాల్సింది పోయి.. అక్కడున్న కొంతమంది తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. వారిని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Rape Case: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనపడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతికి…