Woman Protest: పచ్చబొట్టు చెరిగిపోదులే.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Protest: ప్రేమించానని వెంటపడి.. తీరా ఓకే అన్నాక.. పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రేమ బాధితురాలు న్యాయ పోరాటం చేపట్టింది. ప్రేమ పేరుతో వెంటపడి.. సరే నన్నాక.. ఆరేళ్లకుపైగా కాలం కలసి మెలసి తిరిగి ఆ తర్వాత మొహం చాటేశాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రియుడితో పెళ్లి జరిపించే వరకు కదిలేది లేదంటూ ఏకంగా ప్రియుడి ఇంటి ముందే నిరసన పోరాటం ప్రారంభించింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు న్యాయపోరాటానికి దిగింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తూజాల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Crime News: దుర్మార్గుడా.. ఎంత పని చేశావ్ రా.. ప్రేమించలేదని నడిరోడ్డుపై
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
తూజాల్ పూర్ గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్, దోమకొండకు చెందిన మౌనికకు డిగ్రీ చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరి పేరు మరొకరు పచ్చబొట్టు వేసుకునేంతగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని మౌనిక నాగరాజును అడగడంతో అతన నిరాకరించాడు. తన ఆరేళ్ల ప్రేమను అర్థం చేసుకోమని అతడిని బతిమలాడింది. కానీ అతను ససేమిరా అన్నాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ప్రియుడు నాగరాజు గౌడ్ ఇంటి ఎదుట ప్రియురాలు మౌనిక బైఠాయించింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇలాగే ఇంటి ముందు నిరసన తెలుపుతానని బీష్మించుకు కూర్చుంది. కాబోయే భార్యా భర్తలుగా సమాజంలో చెలామణి అయ్యామని.. ఇప్పుడు తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కంటతడిపెట్టుకుంది. బాధితురాలు చేపట్టిన న్యాయ పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!