ఆన్ లైన్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సైబర్ క్రిమినల్స్ సరికొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్ని్స్తూ రూ. 87 వేలు పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లో షాకింగ్ ఆన్‌లైన్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. చంద్‌ఖేడా ప్రాంతంలో నివసించే ఆ మహిళ జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసింది. కానీ చిన్న వాటికి బదులుగా పెద్ద వంకాయలు రావడంతో ఆమె వాటిని తిరిగి పంపడానికి…