Ujjain: మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డుపై అత్యాచారం.. వీడియో వైరల్
- మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం
- ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం
- వీడియో సోషల్ మీడియాలో వైరల్
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బుధవారం సాయంత్రం నాటిదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Weather Alert: ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతికి మద్యం తాగించి, అత్యాచారం చేసి, బెదిరించి పారిపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో బాధిత మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో.. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తనను మద్యం షాపు దగ్గర కలుసుకుని పెళ్లి కోసం తీసుకొచ్చాడని, ఆ తర్వాత.. అత్యాచారం చేసి బెదిరించి పారిపోయాడని బాధిత మహిళ తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ఈ ఘటనపై కొత్వాలి సీఎస్పీ ఓంప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ.. ఉజ్జయినిలోని కోయిలా ఫటక్ మద్యం దుకాణం దగ్గర అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియో లభ్యమైందని తెలిపారు. ఈ వీడియోను గుర్తించి.. మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు ఎప్పుడూ ఆ మహిళ వెంటే ఉంటానని చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే అత్యాచారం చేసిన అనంతరం యువకుడు బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?