మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బుధవారం సాయంత్రం నాటిదని చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.