Dhurandhar vs The Raja Saab: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదల ప్రారంభంలో కొంతమేర మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్‌టైం టాప్ ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరే దిశగా దూసుకుపోతోంది.
నాలుగు వారాలు గడిచినా కూడా ఉత్తర భారత మార్కెట్‌లో దురంధర్ జోరు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద సినిమాలు లైన్‌లో లేకపోవడంతో, ఈ చిత్రం ప్రతిరోజూ డబుల్ డిజిట్ కలెక్షన్స్‌తో నిలకడగా రాణిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఇదే స్పీడ్ కొనసాగితే టాప్ ఫైవ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌లోకి దురంధర్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
LG మరో మ్యాజిక్..! గోడకు అతుక్కుపోయే Wallpaper TV.. 9mm మందం.. 4 రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్.!
అయితే ఇప్పుడు సినీ ట్రేడ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దురంధర్ వసూళ్లకు బ్రేక్ వేసే సత్తా ప్రస్తుతం ఒక్క ప్రభాస్ సినిమాకే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా హారర్ థ్రిల్లర్ ది రాజా సాబ్ జనవరిలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఉత్తర భారతదేశంలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, సాలార్ వంటి చిత్రాల తర్వాత నార్త్ మార్కెట్‌లో ఆయనకు తిరుగులేని స్టార్ డమ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ కు భారీ ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఒకవేళ ది రాజా సాబ్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, దురంధర్ కలెక్షన్లపై ప్రభావం పడటం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కావడంతో ప్రేక్షకుల ఫోకస్ కొత్త పెద్ద సినిమాపైకి మళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. హారర్ థ్రిల్లర్ జానర్‌లో ప్రభాస్ తొలిసారి నటిస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ కూడా భారీగానే ఉంది. ఇదే ఆసక్తి ఓపెనింగ్స్‌లోకి మారితే దురంధర్ రికార్డులకు చెక్ పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి ప్రభాస్ తన బాక్స్ ఆఫీస్ పవర్‌తో రణవీర్ సింగ్ రికార్డులను అడ్డుకుంటాడా..? లేక దురంధర్ జోరు కొనసాగుతుందా..? అనే ఆసక్తికరమైన విషయానికి సమాధానం మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Bluefin Tuna: ఓడియమ్మ ట్యూనా ఫిష్.. వేలంలో రూ.29 కోట్లు పలికిన ట్యూనా ఫిష్.. అంత ప్రత్యేకత ఏంటంటే..!
