జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ జస్ట్ మిస్‌లో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేదన్న కారణంతో ఆమె అభ్యర్థనను వ్యతిరేకించారు. తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలో గాండే అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి పదవిపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కావడమనేది ఊహాత్మకమని కొట్టిపారేశారు. గాండే అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్థానాల్లో పార్టీ విజయం సాధించడానికే ప్రస్తుతం తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Viral : తాటి చెట్టు ఎక్కి ఇరుక్కుపోయిన గౌడన్న..
జూన్ 4న ఎన్నికల ఫలితాలు అనంతరం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చేపడతారంటూ కొంత మంది రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారని ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కల్పనా సోరెన్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. జేఎంఎం పార్టీలోని శ్రేణుల కోసం తాను అంకిత భావంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Air india: తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గాండే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని తొలుత నిర్ణయించుకొన్నాని.. తన నిర్ణయాన్ని ప్రజలు ప్రేమతో స్వాగతించారని గుర్తు చేశారు. హేమంత్ సోరెన్‌లో త్యాగ గుణం, కష్టించి పని చేసే తత్వాన్ని తాను ఇష్టపడ్డతానని చెప్పారు. ప్రజల్లోకి ఇలా రావడం ఆనందంగా ఉందన్నారు. జూన్ 4న గాండే అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు.. తనకు సంపూర్ణ మద్దతు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. కోట్లాది మంది ప్రజలు చూపిస్తున్న ప్రేమానురాగాలను ప్రస్తుతం హేమంత్ సోరెన్ మిస్ అవుతున్నారన్నారు. హేమంత్ సోరెన్‌ను కుట్రతో.. తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆమె ఆరోపణలు గుప్పించారు. హేమంత్ ఇచ్చే సందేశాలను తాను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తానని కల్పనా సోరెన్ వెల్లడించారు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఎన్నికల సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. కానీ న్యాయస్థానంలో ఉపశమనం దొరకలేదు.
ఇది కూడా చదవండి: RCB vs CSK: ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..