కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం దేవుడెరుగు.. భర్తలను సరాసరి కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. వివాహేతర సంబంధాల కారణంగానే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను అంతమొందించేందుకు ఏకంగా సుపారీలు ఇచ్చి మరి ప్రాణాలు తీయిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో భర్త హత్యకు భార్య తన ప్రియుడికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకు భార్య ప్లాన్ చేసింది.
Also Read:Bomb Threat: పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు
నాగిరెడ్డి పేట మండలం చిన్న ఆత్మకూరుకు చెందిన సంపూర్ణ, పల్లె రవి భార్యాభర్తలు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ఎంటరయ్యాడు. జాన్సన్ అనే వ్యక్తితో సంపూర్ణ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మత్తులో మునిగితేలింది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త రవి హత్యకు లక్ష సపారీ ఇచ్చి చంపేయాలని కోరింది. సంపూర్ణ.. ప్రియుడు జాన్సన్ అతని స్నేహితుడు చాకలి రాజు, నవీన్, మరో మైనర్ బాలుడి తో ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read:Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ మంచి మనసు.. 222 కుటుంబాలకు రగ్గుల పంపిణి!
వారి ప్లాన్ లో భాగంగా డబ్బు అప్పుగా ఇస్తామంటూ ఈనెల 24న రాజు ను డంపింగ్ యార్డు సమీపానికి పిలిపించారు. ఇది నమ్మి అక్కడికి చేరుకున్న రాజు తలపై సుత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త పల్లె రవి వారి నుంచి తప్పించుకున్నాడు. ఇది ఊహించని భార్య తనకు ఏమీ తెలియదన్నట్టు తన భర్తపై దాడి చేశారని భార్య సంపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా భర్త హత్యకు భార్య ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. భార్య సంపూర్ణ తో పాటు ప్రియుడు, హత్యకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.