Site icon NTV Telugu

Wife Kills Husband: రోకలిబండతో కొట్టి భర్తను మట్టుబెట్టిన భార్య.. ఇంటిముందే పాతిపెట్టి..?

Murder

Murder

Wife Kills Husband: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కల్యాణదుర్గం మండలంలోని పాతచెరువు గ్రామంలో ఓ భార్య తన భర్తను హత్య చేసి అతని మృతదేహాన్ని ఇంటి ముందే పాతిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హనుమంతుగా గుర్తించగా, నిందితురాలు అతని భార్య సుకన్యగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన నాలుగు నెలల క్రితమే జరిగినప్పటికీ, తాజాగా తల్లీకూతుళ్ల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ దారుణం బయటపడింది.

Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

కుటుంబ సభ్యుల మధ్య వివాదం పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. నిందితురాలు సుకన్య స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, భర్త హనుమంతుడు అనుమానంతో తరచూ వేధించేవాడని, అందుకే అర్ధరాత్రి సమయంలో రోకలిబండతో తలపై కొట్టి హత్య చేసినట్లు సుకన్య అంగీకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలను తెలుసుకొనేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

Shocking Crime: మిల్క్ షేక్‌‌లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..

భర్త హనుమంతు గొర్రెలు కాసుకుంటూ జీవనం చేసేవాడని, వీరికి ఒక కొడుకు సందీప్, ఒక కూతురు అమృత సంతానం ఉన్నారని భార్య తెలిపింది. సుకన్యకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని, అందువల్ల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని సమాచారం. కొడుకు కూడా గొర్రెలు కాస్తుంటాడు. కూతురు కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. వీరి తండ్రిని చంపిన విషయం బయట ఎక్కడైనా చెబితే నిన్ను కూడా చంపుతానని సుకన్య తన కూతురును బెదిరించిన అమృత. అయితే ఈ అమ్మాయి తన తాతగారి ఊరు అనిమిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లడంతో, హత్య చేసిన విషయం అక్కడ చెబుతుందేమోనని నేడు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సుకన్య నా భర్తను చంపి పూడ్చిపెట్టినానని చెప్పి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.

Exit mobile version