Site icon NTV Telugu

Kurnool Crime: ముద్దు పెట్టేందుకు భర్త యత్నం.. నాలుక కొరికేసిన భార్య..

Kurnool Crime

Kurnool Crime

Kurnool Crime: పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి.. చిన్న చిన్న విషయాలకు ఆ కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి.. కొన్ని సార్లు ఆవేశం కట్టలు తెంచుకుని దాడికి పాల్పడుతున్నారు.. చివరకు హత్యలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా, ఓ భార్య.. తనకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడని భర్త నాలుకను కొరికేసింది.. అంతకుముందు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుండగా.. ఆ తర్వాత భార్యను మళ్లీ దగ్గరకు తీయాలని ప్రయత్నించాడట ఆ భర్త.. కూల్‌ చేయడానికి ముద్దు పెట్టేందుకు యత్నించాడట.. అప్పటికే కోపంతో ఉన్న భార్య ఒక్కసారిగా భర్త నాలుకను కొరికేసింది.

కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తారాచంద్ నాయక్‌ అనే వ్యక్తి పుష్పవతి అనే యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన తర్వాత కొన్ని ఏళ్లపాటు సంసారం బాగానే సాగింది.. అయితే, రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారట.. పరస్పరం దాడి కూడా చేసుకున్నట్టు చెబుతున్నారు.. ఇక, భార్యను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా తారాచంద్‌.. కొద్దిసేపటికి భార్యకు ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడట.. అది కూడా లిప్‌కిస్‌ కోసం ట్రైచేశాడట.. అప్పటికే కోపంతో ఉన్న ఆమె.. వెంటనే భర్త నాలుకను కొరికేసింది.

అయితే, ఈ ఘటనపై ఒక్కొక్కరి వాదన ఒక్కలా ఉంది.. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి.. జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మరోవైపు.. తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ఎన్నిసార్లు చెప్పినా మనిషి మారడం లేదని.. అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు.. అంతేకాదు.. తన భార్య నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని.. పిల్లలు, నేను ఎలా బతకాలో కూడా తెలియడం లేదంటూ వాపోయాడు తారాచంద్.. ఎవరి వర్షన్‌ ఎలా ఉన్నా.. ఓ పచ్చని సంసారంలో చిన్న విషయాలు చిచ్చుపెట్టాయి.

Exit mobile version